ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చీటీల పేరుతో మోసపోయామని బాధితులు ఆందోళన

By

Published : Jun 23, 2021, 2:01 PM IST

చీటీల పేరుతో మహిళలు మోసపోయిన ఘటన నరసాపురంలో జరిగింది. ఇద్దరు మహిళలు చీటీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

cheating case
cheating case

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణము ఎన్టీఆర్ కాలనీకి చెందిన లక్ష్మి కుమారి, విజయలక్ష్మిలు గత కొంత కాలంగా చీటీల వ్యాపారం చేస్తున్నారు. దీంతో స్థానికులు వారికి రూ.6 లక్షలు, రూ.3 లక్షలు చీటీలు కడుతున్నారు. పాటపాడుకున్న వారికి చీటీలు చెల్లించలేదు. రోజుల తరబడి కాలం గడుపుకుంటూ వచ్చారు. గత 40 రోజుల క్రితం లక్ష్మీకుమారి ఇల్లు అమ్మకం చేసింది. డబ్బులు వచ్చాక బాకీలు చెల్లిస్తామని చెప్పి.. చేతికి డబ్బులు రాగానే పరారీ అయ్యింది. అదే బాటలో విజయలక్ష్మి చీటీలు ఇవ్వకుండా ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయింది. చీటీలు కట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details