ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు వేలం.. రూ.13 లక్షల ఆదాయం

By

Published : Jul 13, 2021, 12:45 PM IST

అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు చింతలపూడి పోలీసులు వేలం నిర్వహించారు. మొత్తం 32 వాహనాలకు రూ.13.42 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా అడిషనల్ ఎస్పీ జయరామరాజు పేర్కొన్నారు.

auction
వాహనాలకు వేలం

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్​లో అక్రమ మద్యం రవాణా కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో 32 వాహనాలకు రూ. 13.42 లక్షల ఆదాయం వచ్చిందని పోలీసులు తెలిపారు. నగదు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని చెప్పారు.

యువత చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా అడిషనల్ ఎస్పీ జయరామరాజు తెలిపారు. మద్యం అక్రమ రవాణా, గుట్కా రవాణా వంటివాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details