ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'హత్య కేసు నమోదు చేయండి.. అప్పటివరకూ శవపరీక్షకు అనుమతించం'

By

Published : Aug 15, 2021, 9:08 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. రెండ్రోజుల క్రితం గ్రామ చెరువులో అనుమానాస్పదంగా మృతి చెందిన రాజుది.. హత్య కేసుగా నమోదు చేయాలని మృతుని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు శవ పరీక్షకు అంగీకరించబోమని ఆందోళన చేపట్టారు.

జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆస్పత్రి వద్ద ఆందోళన నెలకొంది. శ్రీనివాసపురం సూరయ్య చెరువులో రాజు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన కుమారుడిని హత్య చేశారంటూ పోలీసులకు రాజు తండ్రి ఫిర్యాదు చేశాడు. హత్య కేసు నమోదు చేయాలని రాజు బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు శవ పరీక్షకు అంగీకరించబోమని ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

రెండ్రోజుల క్రితం గ్రామ చెరువులో రాజు అనుమానాస్పద మృతి చెందాడు. రాజు పనిచేసే యజమాని ఇంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. యజమానికి పోలీసులు మద్దతిస్తున్నారని మృతులు బంధువులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details