ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Baby Dead: భార్యపై అనుమానంతో.. తొమ్మిది నెలల బాలుడి హత్య

By

Published : Jul 12, 2021, 1:20 PM IST

Updated : Jul 12, 2021, 4:38 PM IST

infant murdered
infant murdered

13:15 July 12

బాలుడు మృతి

భార్యపై అనుమానంతో.. తొమ్మిది నెలల బాలుడి హత్య

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో దారుణం జరిగింది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి.. అతి కిరాతకంగా ప్రవర్తించాడు. కనీసం జాలి చూపకుండా... ముక్కుపచ్చలారని పసి కందుపై ప్రతాపం చూపించాడు. ఇందుకు కారణం తెలిసి.. సభ్య సమాజం తల దించుకుంటోంది.

అనుమానమే... ఉసురు తీసింది

అనుమానం పెను భూతమైంది.. అని చాలా సార్లు చదివే ఉంటాం. ఈ సంఘటనలోనూ ఆ అనుమానమే.. ఏడాదైనా నిండని పసి కందు పాలిట యమ పాశమైంది. చెరుకువాడ గ్రామానికి చెందిన నారాయణ.. తన భార్య సుధారాణిపై పెంచుకున్న అనుమానమే.. ఆ బాలుడి ప్రాణం తీసింది. ఆడిస్తున్నట్టుగా నచిస్తూ.. బాబు నోట్లో చేపను పెట్టిన నారాయణ.. ఆ చిన్నారిని ఊపిరి ఆడకుండా చేశాడు. బాలుడి ప్రాణం పోతున్నా అలాగే ఉన్నాడు. ఈ విషయాన్ని బిడ్డను పోగొట్టుకున్న తల్లి సుధారాణి తీవ్ర ఆవేదనతో వెల్లడించింది.

తెల్లగా ఎందుకు పుట్టాడని...

"అనుమానంతో నన్ను, నా కుమారుడిని నా భర్త తరుచుగా కొడుతూ ఉండేవాడు. ఆ అనుమానంతోనే నా కుమారుడిని హత్య చేశాడు. నా భర్త, నేను చూసేందుకు నల్లగా ఉంటాం. నా కుమారుడు తెల్లగా ఉంటాడు. అలా ఎందుకు పుట్టాడు అని తరచుగా నన్ను హింసించేవాడు. చివరికి నా కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడు" అంటూ.. సుధారాణి కన్నీటిపర్యంతమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

water war: జల వివాదంపై పార్లమెంట్​లో మాట్లాడుతా: ఎంపీ మాధవి

Last Updated : Jul 12, 2021, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details