ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ELECTION RESULTS: పరిషత్ ఎన్నికల్లో వైకాపా హవా

By

Published : Sep 19, 2021, 11:34 AM IST

Updated : Sep 19, 2021, 8:22 PM IST

zptc and mptc election counting at vizianagaram
zptc and mptc election counting at vizianagaram ()

విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ (zptc, mptc elections) ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆదిపత్యం కొనసాగింది. మెజార్టీ స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

విజయనగరం జిల్లా పరిషత్ ఫలితాలు

విజయనగరం జిల్లాలో పరిషత్​ ఓట్ల లెక్కింపు ముగిసింది. వైకాపా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలో వైకాపా 389, తెదేపా 86 ఎంపీటీసీల్లో స్థానాల్లో గెలుపొందాయి. స్వతంత్రులు 11 చోట్ల గెలుపొందగా.. భాజాపా ఓ చోట విజయం సాధించింది. మొత్తం 34 జడ్పీటీసీలలో 3 ఏకగ్రీవం కాాగా.. మిగిలిన 31 చోట్ల వైకాపా విజయం సాధించింది.

జిల్లాలో మొత్తం 549 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 55 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఒక ఎంపీటీసీ మరణించగా.. పోలింగ్​కు ముందు పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో ఏడుగురు మరణించారు. మొత్తం 487 స్థానాలకు ఎన్నిక నిర్వహించగా.. పోలింగ్ అనంతరం నలుగురు అభ్యర్థులు మృతి చెందారు. అలాగే జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకుగానూ 3 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 31 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

మొత్తం 34 మండలాలకుగాను 31 చోట్ల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. దీనికోసం 34 మంది ఆర్వోలు, 88 మంది ఎఆర్వోలులు, 956 మంది కౌంటింగ్ సూపర్​వైజర్లు, 1872 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 75 మంది స్ట్రాంగ్ రూం ఇన్​ఛార్జీలు విధులు నిర్వహించారు. ప్రతీ కౌంటింగ్ కేంద్ర వద్ద కొవిడ్ నిబంధనలు పాటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుడా ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్​ విధించారు.


ఇదీ చదవండి..

Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated :Sep 19, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details