ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముంచెత్తిన వానలు... మొలకెత్తిన మొక్కజొన్నలు

By

Published : Oct 17, 2020, 8:50 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం గాది పిల్లవలస గ్రామంలో వర్షాలకు తడిచి మొక్కజొన్న పంట మొలకలు వచ్చాయి. మండలంలోని ఇతర ప్రాంతాల్లోని రైతులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వర్షాలకు తడిసిపోయిన మొక్కజొన్నలు పూర్తిగా పాడైపోయాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

maize farmers
maize farmers

విజయనగరం జిల్లా సాలూరు మండలం మావిడి పంచాయతీ గాది పిల్లివలస గ్రామంలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత కోసి ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షాలకు పూర్తిగా తడిచిపోయి... మొలకలు వచ్చాయి. ఎంతో కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పాడైపోతుందని రైతలు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సాలూరు మండలంలో సుమారు 2130 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. వర్షాలకు అత్యధిక రైతుల పరిస్థితి ఇలానే ఉంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం పరదాలు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details