ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vijayanagaram: ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరిన విద్యార్థి నాయకుల అరెస్టు

By

Published : Jun 28, 2021, 4:37 PM IST

ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక కార్యాలయం వద్ద విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. పురపాలక సర్వసభ్య సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే జోగారావుకు వినతి పత్రం అందజేస్తామని విద్యార్థి సంఘం నాయకులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. దాంతో కార్యాలయ ముట్టడికి యత్నించారు.

dharna
ధర్నా

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక కార్యాలయం వద్ద విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. తర్వాత లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పురపాలక సర్వసభ్య సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే జోగారావుకు వినతి పత్రం అందజేస్తామని విద్యార్థి సంఘం నాయకులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. సమావేశం ముగిసిన తర్వాత ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో విద్యార్థి సంఘం నాయకులు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసుకున్న ఎమ్మెల్యే.. నాయకుల వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు

ఇదీ చదవండి:Tragedy: విషాదం : బెట్టింగ్‌తో అప్పుల ఊబిలో చిక్కుకుని దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details