ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యూటీఎఫ్ నాయకుల సేవాభావం

By

Published : Apr 22, 2020, 10:08 AM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో యూటీఎఫ్ నాయకులు.. దాతృత్వాన్ని చాటుకున్నారు. గిరిజనులకు, పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.

VIZAIYANAGARAM DISTRICT
యుటిఎఫ్ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిరుపేదలకు సాయం అందించడానికి యూటీఎఫ్ నాయకులు ముందుకు వచ్చారు. చేయి, చేయి కలిపారు. సుమారు లక్ష రూపాయలు విరాళాలు సేకరించారు. గిరిజనులకు, పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. మండలంలో రేగ పుణ్యగిరి దబ్బగుంట, చిట్టం పాడు, లక్ష్మీపురం, గాదెలోవ గిరిజన గ్రామాలకు చెందిన 450 మంది గిరిజనులకు అందించారు. పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బందికీ సరుకులు సమకూర్చారు.

ABOUT THE AUTHOR

...view details