ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళల హక్కులు, చట్టాల గురించి తెలిపే బ్రౌచర్​ విడుదల

By

Published : Mar 23, 2021, 8:18 PM IST

భారత రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కుల గురించి, వారి హక్కులు కాపాడే చట్టాల గురించి అవగాహన కల్పించే అంశాలపై రూపొందించిన బ్రౌచర్​ను.. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు. జిల్లా దిశా మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఈ బ్రౌచర్​ను రూపొందించారు.

vizianagaram sp
మహిళల హక్కులు, చట్టాల గురించి తెలిపే బ్రౌచర్​ విడుదల

విజయనగరం జిల్లా దిశా మహిళా పోలీసులు.. 'మహిళలు.. మీ రక్షణ చట్టాలు తెలుసుకోండి' పేరిట ప్రత్యేకంగా రూపొందించిన బ్రౌచర్​ను జిల్లా ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు, వారి రక్షణకు నిర్దేశించిన చట్టాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలకు రక్షణ గురించి చట్టాలపై అవగాహన లేని కారణంగా వివక్షకు గురవుతున్నారని తెలిపారు.

ఆడవారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి, వారి హక్కులు కాపాడే చట్టాల గురించి అవగాహన కల్పించే అంశాలపై రూపొందించిన ఈ బ్రౌచర్​.. మహిళలు, విద్యార్థినులకు చాలా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు చిట్టిబాబు, మహిళా, శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారి రాజేశ్వరి, దిశా మహిళా పీఎస్ డీఎస్పీ త్రినాధ్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details