ఆంధ్రప్రదేశ్

andhra pradesh

850 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం.. వృద్ధురాలు అరెస్ట్

By

Published : Dec 21, 2020, 4:11 PM IST

సాలూరు మండలం మామిడిపల్లిలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 850 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు.

నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం
Natu sara packets Seized

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో 850 నాటుసారా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. మందస్తు సమాచారంతో ఎస్సై దినకరన్.. సిబ్బందితో కలిసి గ్రామంలో దాడులు చేశారు. గాజుల రాములమ్మ (62) అనే వృద్ధురాలి వద్ద సారా ప్యాకెట్లు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేశారు. నాటుసారా విక్రయించినా, తయారుచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details