ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గంజాయి అక్రమంగా తరలిస్తోన్న యువకుల అరెస్టు

By

Published : Dec 22, 2019, 6:56 PM IST

విజయనగరంలో గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 8 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు.

illegal  Cannabis transfer gang arrested by  Vizianagaram  police
విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ముఠా అరెస్టు చేసిన సబ్​ఇస్స్​పెక్టర్ నీలకంఠ

గంజాయి తరలిస్తోన్న యువకుల అరెస్టు

విజయనగరం జిల్లా బొడ్డవరం జంక్షన్​లో వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా గంజాయి తరలిస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరకు నుంచి ఆటోలో వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించగా వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువకులు బెంగళూరులోని హసన్​ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరిద్దరూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ గంజాయికి అలవాటు పడి దాని కోసం అరకు వచ్చారని.. ఇక్కడ గంజాయిని కొనుక్కొని తీసుకువెళ్తుండగా పట్టుకున్నామని ఎస్సై నీలకంఠ తెలిపారు. వీరిని రిమాండుకు తరలించినట్లు చెప్పారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details