ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లా వ్యాప్తంగా జోరువానలు.. జలమయమైన రోడ్లు

By

Published : Jul 11, 2021, 3:28 PM IST

Updated : Jul 11, 2021, 3:43 PM IST

అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కొన్నిచోట్ల రోడ్లు జలమయం కాగా... మరికొన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.

heavy rains in Vizianagaram
విజయనగరం జిల్లావ్యాప్తంగా జోరువానలు

జిల్లా వ్యాప్తంగా జోరువానలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కురిసిన వానకు రోడ్లున్నీ జలమయమయ్యాయి. మరికొన్నిచోట్ల కాలనీలు నీట మునిగాయి. మరోపక్క వర్షాలు పడటంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడి ఎండ, వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంపై ఉంటుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్లు చెప్పారు.

Last Updated : Jul 11, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details