అల్పపీడన ప్రభావంతో విజయనగరంలో విస్తారంగా వర్షాలు ఎగువన కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్ట్‌లో వరదనీరు చేరుతోంది. జలాశయం సాధారణం నీటి మట్టం 2.509 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.021టీఎంసీలకు చేరింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటకు ఊపిరిపోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విజయనగరం రెవిన్యూ డివిజన్ లోని, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, విజయనగరం, బొండపల్లి, మెంటాడ, జామీ, శృంగవరపుకోట, లక్కవరపుకోట మండలాల్లో ఎండిపోతున్న వరిపైర్లకు ఊరట లభించింది.
ఏ ప్రాంతంలో ఎంత..?
జిల్లా వ్యాప్తంగా 22.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యధికంగా పూసపాటిరేగ మండలంలో 50.3మిల్లీమీటర్లు, డెంకాడలో 39.2, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెర్లాంలో 35.2, లక్కవరపుకోటలో 34.2, గరివిడి, చీపురుపల్లి, వేపాడ మండలాల్లో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లిమర్ల 31.8 మిల్లీ మీటర్లు, శృంగవరపుకోటలో 30, విజయనగరంలో 28,6, జామీలో 26.2, సీతానగరం, బొబ్బిలి మండలంలో 22మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గుర్లలో 21.8, బొండపల్లి, గుమ్మలక్ష్మీపురం, గురుగుబిల్లి మండలాల్లో 19మిల్లీమీటర్లు, బలిజపేటలో 18.6, మెంటాడ, గజపతినగరం మండలాల్లో 17మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
ఇవీ చూడండి:
తల్లి మృతి చెందిన గంట వ్యవధిలోనే...