విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో... వరహాలు గెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. పురపాలక సంఘం పరిధిలోని గణేష్ నగర్ ముంపునకు గురైంది. గెడ్డ నీరు కాలనీలోకి వచ్చి చేరింది. ప్రధాన రహదారిలో ఎక్కువ నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాలనీలోకి చేరిన వర్షపు నీరు బయటకు పోయేందుకు కాలువలు సరిగ్గా లేకపోవడంతో నివాసాల మధ్య నీరు నిల్వ ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం... నీట మునిగిన గణేష్‌నగర్
విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా వరహాలు గెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో పురపాలక సంఘం పరిధిలోని గణేష్ నగర్ ముంపునకు గురైంది. కాలనీలోకి చేరిన వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం... నీట మునిగిన గణేష్ నగర్
TAGGED:
heavy rains in vizianagaram