ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Jan 23, 2021, 7:28 PM IST

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్లు దేవస్థాన ప్రతినిధి గంజి కాశీనాయుడు తెలిపారు. ఈ నెల 27 నుంచి 29వరకు జాతర జరగనుంది.

sambara
శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తి

విజయనగరం జిల్లా మక్కువ మండలంలో ఈ నెల 27నుంచి ప్రారంభంకానున్న శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ప్రతినిధి గంజి కాశీనాయుడు తెలిపారు. రవాణా పారిశుద్ధ్యం గురించి మక్కువ ఎంపీడీవో చర్యలు తీసుకున్నారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బొబ్బిలి, సాలూరు మునిసిపాలిటీ నుంచి అదనంగా సిబ్బందిని నియమించి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

కాగా ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు.

ఇదీ చదవండి:తిరుపతి నుంచి రామతీర్థానికి సీత, రామలక్ష్మణుల విగ్రహాలు

ABOUT THE AUTHOR

...view details