కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2022లో... జాతీయ స్థాయిలో విశాఖ నాలుగో స్థానం దక్కించుకుంది. 10నుంచి 40లక్షల జనాభా గల నగరాల కేటగిరిలో క్లీన్ బిగ్ సిటీగా నిలిచింది. ఆధ్యాత్మిక నగరి తిరుపతికి సఫాయి మిత్ర సురక్షిత్ సెహన్ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో తొలి మూడు ర్యాంకుల్లో.. ఇండోర్, సూరత్, నవీ ముంబయి నిలిచాయి. లక్షకు పైబడి జనాభా గల నగరాల్లో విజయవాడకు ఐదో స్థానం, తిరుపతికి ఏడో స్థానం, కర్నూలుకు 75వ స్థానం, నెల్లూరుకు 81వ స్థానం వచ్చాయి. లక్షలోపు జనాభా గల నగరాల్లో ఏపీకి ఒక్క ర్యాంకూ రాలేదు.
స్వచ్ఛ సర్వేక్షన్-2022లో విశాఖకు నాలుగో స్థానం
కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2022లో విశాఖకు నాలుగో స్థానం దక్కింది. తొలి మూడు ర్యాంకుల్లో ఇండోర్, సూరత్, నవీ ముంబయి లు దక్కించుకున్నాయి. లక్షకు పైబడి జనాభా గల నగరాల్లో విజయవాడకు 5, తిరుపతికి 7వ స్థానా లను కైవసం చేసుకున్నాయి.
vishaka