ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'క్రీస్తు మిషనరీ ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది'

By

Published : Nov 17, 2022, 7:56 PM IST

TDP leaders alleged on ysrcp: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు మిషనరీ ఆస్తులకు రక్షణ లేదని... విశాఖ తెదేపా క్రైస్తవ విభాగం అధ్యక్షుడు డేవిడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో క్రైస్తవ ఆస్తుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు.

ఊరకుటి డేవిడ్
ఊరకుటి డేవిడ్

Protection of Christ's Missionary Assets : వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత క్రీస్తు మిషనరీ ఆస్తులకు రక్షణ లేదని విశాఖ తెదేపా క్రైస్తవ విభాగం ప్రతినిధులు ఆవేదన చెందారు. తెలుగు దేశం పార్టీ నేత డేవిడ్ టీడీపీ కార్యాలయంలో మిషనరీ ఆస్తుల విషయమై మీడియాతో మాట్లాడారు. విశాఖలో క్రైస్తవ ఆస్తులు దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీసీ చర్చి భూములను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కాజేసే చర్యలు చేయడం దీనికి నిదర్శనమన్నారు. దాతలు దేవుని పట్ల ప్రేమతో ఇచ్చిన స్థలాలను సైతం అడ్డగోలుగా బెదిరించి సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు విశాఖలో తరచూ వెలుగు చూస్తున్నాయని ఆవేదన చెందారు. క్రీస్తు మిషనరీ ఆస్తుల ఆక్రమణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

డేవిడ్, విశాఖ టీడీపీ క్రైస్తవ విభాగం అధ్యక్షులు

ABOUT THE AUTHOR

...view details