ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దక్షిణాది గ్రిడ్‌లో లోపం.. ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి

By

Published : May 3, 2022, 5:57 AM IST

Updated : May 3, 2022, 10:11 AM IST

ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే.. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.

NTPC Simhadri
ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి

దక్షిణాది గ్రిడ్‌లో లోపం వల్ల విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంకేతికలోపం తలెత్తడంతో.. విద్యుతుత్పత్తి నిలిచి పరిసరప్రాంతాలు అంధకారంగా మారాయి. గ్రిడ్​కి విద్యుత్ ప్రసార లైన్లలో ఏర్పడిన సమస్య వల్ల అకస్మాత్తుగా ప్లాంట్లలోని విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.

హిందూజాలోనూ విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకేసారి సింహాద్రి నాలుగు యూనిట్లు, హిందూజా రెండు యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఎండాకాలంలో ఇలాంటి లోపాలు తలెత్తడం వల్ల రాష్ట్రంలో మరింతగా విద్యుత్ కోతలు సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌.. ఘటనలపై ప్రభుత్వం సీరియస్​

Last Updated : May 3, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details