ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాద్రి అప్పన్న స్వామికి ఆఖరి విడత చందన సమర్పణ

By

Published : Jul 5, 2020, 3:41 AM IST

విశాఖ సింహాద్రి అప్పన్నకు ఇవాళ ఆఖరి విడత చందన సమర్పణ జరగనుంది. ఇప్పటికే ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.

simhachalam simhadri appannaswamy chandanostavam
simhachalam simhadri appannaswamy chandanostavam

సింహాచలం అప్పన్నస్వామికి ఇవాళ జరగనున్న ఆఖరి విడత చందన సమర్పణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన గిరి ప్రదక్షిణ, రేపు జరగబోయే ఆలయ ప్రదక్షిణ రద్దు చేశారు. భక్తులు లేకుండా స్వామివారికి ఏకాంతంగా చందన సమర్పణ చేయనున్నారు. ఆలయ ప్రదక్షిణ ఉందనుకుని భక్తులు ఎవరూ రావొద్దని దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆఖరి విడత చందన సమర్పణతో స్వామి వారు పూర్తి చందన స్వామిగా దర్శనమివ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details