ఆంధ్రప్రదేశ్

andhra pradesh

nara lokesh : 'వైకాపా కబ్జాకోరులు.. విశాఖను రాబంధుల్లా పీక్కుతింటున్నారు'

By

Published : Mar 29, 2022, 4:30 AM IST

వైకాపా నాయకులు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.ఇంటెలిజెన్స్‌ ఎస్పీకి చెందిన స్థలాన్నే ఎంపీ ఆక్రమించడం... వైకాపా కబ్జాపర్వంలో సరికొత్త కోణమని దుయ్యబట్టారు. ప్రజల్ని కాపాడే పోలీసు బాస్‌లకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని నిలదీశారు.

nara lokesh
nara lokesh

విశాఖను వైకాపా కబ్జాకోరులు రాబంధుల్లా పీక్కుతింటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. కన్నుపడిన ప్రతిగజాన్ని ఆక్రమిస్తూ.. విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీకి చెందిన స్థలాన్నే ఎంపీ ఆక్రమించడం... వైకాపా కబ్జాపర్వంలో సరికొత్త కోణమని దుయ్యబట్టారు. ప్రజల్ని కాపాడే పోలీసు బాస్‌లకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని నిలదీశారు. వైకాపా ల్యాండ్ మాఫియాకు ముగింపు పలకాలన్న లోకేశ్‌.. బాధితులంతా విశాఖను రక్షించుకునేందుకు బయటకు రావాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details