ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ ప్రైవేటీకరణ ఆపమని ప్రధానిని కోరుతాం: ఎంపీ ఎంవీవీ

By

Published : Feb 13, 2021, 5:33 PM IST

ప్రైవేటీకరణపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మద్దతు తెలిపారు.

Mp Mvv Satyanarayana
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

త్వరలో ప్రధాని అపాయింట్​మెంట్​ తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయమని కోరుతామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. దిల్లీలో ఎంపీలతో కలిసి అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలాసీతారామన్​ని కలిసి వారి దృష్టిలో ఈ విషయాన్ని ఉంచామన్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రిని కలిసేందుకు సన్నద్ధమవుతున్నామని వివరించారు. అవసరమైతే కార్మిక సంఘాల నేతలను దిల్లీకి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details