ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చట్టాలను కాలరాసే హక్కు ఎవరికీ లేదు'

By

Published : Feb 20, 2020, 1:20 PM IST

ఆదివాసీ గిరిజనుల పోరాటాల ఫలితంగా ఎన్నో చట్టాలు వచ్చాయని... వీటిని కాలరాసే హక్కు ఎవరికీ లేదంటూ మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట... 2 పేజీల లేఖ విడుదలైంది.

Maoist East Division secretary Aruna released a two-page letter saying that many laws have come into effect as a result of the adivasi tribal struggles.
ఆదివాసీ హక్కులపై మావోస్టులు లేఖ విడుదల

మావోస్టుల పేరిట విడుదలైన లేఖ

మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరు మీద రెండు పేజీల లేఖ విడుదలైంది. ఆదివాసీ గిరిజనుల పోరాటాల ఫలితంగా ఎన్నో చట్టాలు వచ్చాయని... వీటిని కాలరాసే హక్కు ఎవరికీ లేదంటూ లేఖలో పేర్కొన్నారు. గిరిజనేతరులు.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో గిరిజనులు చేస్తున్న ధర్నాలు, ర్యాలీలు, బంద్​లకు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. ఆదివాసీలు చేసిన ఎన్నో త్యాగాలు పోరాటం ఫలితంగానే చట్టాలు వచ్చాయని చెప్పారు. భూ బదలాయింపు చట్టం, 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం ఆదివాసీల పోరాటాల ద్వారా వచ్చాయన్నారు. చట్టాలు లేకుంటే దోపిడి రాజ్యం పెరిగిపోతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details