Award Received By Conductor Jhansi: గాజువాకలో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. 'పల్సర్ బైక్ మీద..' అనే పాటతో ప్రాచుర్యం పొందిన డాన్సర్ ఝాన్సీ, కొరియోగ్రాఫర్ చదలవాడ రమేష్‌బాబులను విశాఖ గణేష్ సేవా సమితి సత్కరించింది. గురు పూజోత్సవం సందర్భంగా గురు శిష్య పురస్కారాన్ని అందజేసింది. పురస్కార గ్రహీతలు చదలవాడ రమేష్ బాబు, ఝాన్సీలు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించి అవార్డులను ప్రధానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
"తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజల మన్ననలు పొందేందుకు ఆశీస్సులు కావాలి. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా మా కళాకారుల బృందం అనేక ప్రదర్శనలు ఇచ్చింది, కళాకారులు మెరుగ్గా ఉంటేనే ఆయా ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయి. అయితే ప్రతిభాపాటవాలు ఉంటే ఎప్పటికైనా తమకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి తాజాగా మాకు లభించిన ఆదరణే నిదర్శనం. ప్రభుత్వం కూడ కళాకారులని ఆదుకోవాలి". - చదలవాడ రమేష్ బాబు, కండక్టర్ ఝాన్సీ గురువు
"ఒక పక్క ఉద్యోగం చేస్తూ.. మరో పక్క కుటుంబాన్ని పోషిస్తూ డాన్సులతో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నా గుర్తింపునకు కృషి చేసిన నా గురువు రమేష్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. మాస్టర్ లేకపోతే నాకు గుర్తింపు వచ్చేది కాదు.. ఆయనకు నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన 'ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమానికి, 'మల్లెమాల' వారికి నా కృతజ్ఞతలు". -కండక్టర్ఝాన్సీ
Conductor Jhansi Dance Talent: ‘‘నేను అట్టాంటి.. ఇట్టాంటి ఆడదాన్ని కాదు బాబోయ్... పల్సర్ బైక్ మీద రాను బాబోయ్..’’ అనే పాటకు విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో కండక్టర్‌గా పని చేస్తున్న ఎ.ఝాన్సీ ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలో ప్రదర్శించిన ఫోక్ డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారుని హుషారెత్తిస్తోంది. ఈ ప్రదర్శనకు మెచ్చి న్యాయనిర్ణేతలు వేదికపైకి వెళ్లి.. ఆమెతో కలిసి స్టెప్పులేసి అభినందిస్తున్నారు. గాజువాక బీసీరోడ్డుకు చెందిన ఝాన్సీ భర్త నూకరాజు. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. అటు ఉద్యోగం, చేస్తూనే ఇటు ఆసక్తి ఉన్న కళలో ప్రశంసలందుకుంటున్నారు.