ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎట్టకేలకు పంచాయతీలకు నిధులు విడుదల

By

Published : Nov 20, 2020, 6:04 PM IST

14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు చేరాయి. విశాఖ జిల్లాకు సంబంధించి సుమారు 75 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి.

panchayat funds released
panchayat funds released

14వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు పంచాయతీలకు చేరాయి. విశాఖ జిల్లాకు సంబంధించి సుమారు 75 కోట్ల రూపాయలు మంజూరు కాగా వీటిలో 70.38 కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన నిధులు నీటి పథకాల నిర్వహణ కోసం జిల్లా పరిషత్తు ఖాతాలో వేశారు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు ప్రస్తుతం జమ అయ్యాయి. దీనివల్ల పంచాయతీల ఆర్థిక ఇబ్బందుల కొంతమేర తొలగనున్నాయి. ఈ నిధులు తాగు నీటి పథకాల నిర్వహణ, పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు తదితర అవసరాలకు వినియోగించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details