ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి: వెంకయ్యనాయుడు

By

Published : Feb 7, 2023, 9:55 PM IST

Greendale School Visakhapatnam: విశాఖ మధురవాడలోని గ్రీన్​ డేల్ పాఠశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాటుగా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. విద్యావేత్తలు విలువలతో పాటుగా... భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేప్పెలా వ్యవహరించాలని వెంకయ్య పిలుపునిచ్చారు.

Venkaiah Naidu
వెంకయ్య నాయుడు

Former Vice President Venkaiah Naidu: విద్యార్థులు క్రమశిక్షణతో పాటుగా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇందుకు యోగా ఒక ముఖ్య సాధనమని విశాఖ మధురవాడలోని గ్రీన్ ​డేల్ పాఠశాలలో వెల్లడించారు. విశాఖ మధురవాడలోని గ్రీన్ ​డేల్ పాఠశాలను వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడ పిల్లలతో ఆయన ముచ్చటించారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక క్రీడలో ప్రవేశం ఉండాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నచ్చిన క్రీడల్లో సాధన చేయడం ద్వారా అన్ని రకాల వికాసానికి అది తోడ్పడుతుందని చెప్పారు. విద్యార్థి దశ కీలకమని.. ఇది వారి వ్యక్తిత్వ వికాసాన్ని మాత్రమే కాకుండా... దేశ అభివృద్ధికి సంబంధించిన విషయమని వెల్లడించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విశాఖ మధురవాడలోని గ్రీన్ ​డేల్ పాఠశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు.. అక్కడ పిల్లలతో ముచ్చటించారు. విశ్వ గురు స్థానాన్ని భారతదేశం చేరుకునేందుకు మంచి విలువలతో కూడిన విద్యను అందించడం.. ఆచరణాత్మకంగా దానిని చూపడం ప్రధాన అంశాలుగా వివరించారు. విద్యావేత్తలు ఈ రకమైన విలువలను భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేప్పెలా వ్యవహరించాలని వెంకయ్య పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వెంకయ్య నాయుడు తిలకించారు. ఎంతో సమున్నతమైన వారసత్వ సంపద మనకు ఉందని.. దానిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details