విశాఖలోని విద్యుత్ ఏఈ నాగేశ్వరరావు ఇంట్లో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. కొమ్మాది డివిజన్లో విద్యుత్ ఏఈగా పనిచేస్తున్న ఆయన ఇంట్లో... తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. నాగేశ్వరరావుకు సంబంధించిన 7 చోట్ల అనిశా అదనపు ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. విశాఖలోని సీతమ్మధార, సీతమ్మపేట, విశాలాక్షినగర్, ఎంవీపీ కాలనీ, రాంబిల్లిలో తనిఖీలు చేస్తున్నారు.
నాగేశ్వరరావుకు చెందిన 3 బ్యాంకు లాకర్లు, ఆస్తులు, భూములను అధికారులు గుర్తించారు. విశాఖలోని ల్యాన్సమ్ టపర్స్లో ఖరీదైన ఫ్లాట్ సైతం ఆయనదే అని గుర్తించారు. లాకర్లను తెరిచేందుకు ఏఈని ఇంటినుంచి తీసుకువెళ్లారు. 1991లో సర్వీసులో చేరిన నాగేశ్వరరావు... 1994లో మెుదటిసారి అనిశాకు పట్టుబడగా.. సస్పెన్షన్ వేటు పడింది. నాటినుంచి సుమారు 15 ఏళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న ఆయన్ను.. 2012లో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది.