ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ: దువ్వాడ స్టేషన్‌లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

By

Published : Dec 7, 2022, 9:56 AM IST

Updated : Dec 7, 2022, 11:37 AM IST

రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని
రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

09:52 December 07

ప్లాట్‌ఫాం పగలగొట్టి యువతిని బయటకు తీసిన సిబ్బంది

ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని

విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ విద్యార్థిని రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంటన్నరపాటు యవతి రైలు, ఫ్లాట్‌ఫామ్‌ మధ్యనే తీవ్రంగా బాధపడ్డారు. చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది... యువతిని బయటకు తీశారు. ప్లాట్‌ఫాం పగలగొట్టిన సిబ్బంది.. యువతిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రెస్క్యూ బృందం ఆమెను కిమ్స్ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న అన్నవరానికి చెందిన శశికళగా గుర్తించారు. ప్రస్తుతం యువతి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:


Last Updated : Dec 7, 2022, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details