ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ పోర్ట్ ట్రస్ట్​లో 58వ జాతీయ మారి టైం దినోత్సవం

By

Published : Apr 6, 2021, 2:04 PM IST

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో 58వ జాతీయ మారి టైం దినోత్సవాన్ని నిర్వహించారు. పోర్ట్ చైర్మన్ కె. రామ్మోహన రావు ముఖ్య అతిథిగా హాజరై.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మారి టైం సిబ్బందికి నివాళులు అర్పించారు.

58th National Maritime Day
58వ జాతీయ మారి టైం దినోత్సవం

58వ జాతీయ మారి టైం దినోత్సవాన్ని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్​లో నిర్వహించారు. ఈ ఏడాది కొవిడ్ సమయంలో "సమర్ధంగా.. మనుగడ" అనే థీంలో మారిటైం డేను నిర్వహించారు. పోర్ట్ చైర్మన్ కె. రామ్మోహన రావు ముఖ్య అతిథిగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మారి టైం సిబ్బందికి నివాళులు అర్పించారు. మెరైన్ సిబ్బంది నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మెరైన్ సిబ్బంది పలు విన్యాసాలను ప్రదర్శించారు. గత దశాబ్ద కాలంలో భారత నౌకాయాన రంగంలో చోటు చేసుకున్న మార్పులను మననం చేసుకున్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలంటే, కష్టపడి పని చేయడం ఒక్కటే మార్గమని, లేదంటే పోటీ ప్రపంచంలో వెనకబడి పోతామని రామ్మోహనరావు సూచించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details