ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా.. విడుదల చేసిన తితిదే

By

Published : Jun 27, 2022, 10:35 AM IST

Updated : Jun 27, 2022, 10:55 AM IST

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. తితిదే విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 29 వరకు టికెట్ల నమోదుకు అవకాశం కల్పించిన తితిదే.. జూన్ 29న మధ్యాహ్నం 12 తర్వాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్‌ టికెట్లను విడుదల చేయనుంది.

ttd released arjitha seva tickets for month of september
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన తితిదే

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. తితిదే విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీడిప్‌లో కేటాయించింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు టికెట్ల నమోదుకు అవకాశమిచ్చారు. లక్కీడిప్‌ టికెట్ల జాబితాను తితిదే వెబ్‌సైట్‌లో ఉంచనుంది. జూన్ 29న మద్యాహ్నం 12 తర్వాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. పలు సేవా టికెట్లు బుధవారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయునున్న తితిదే.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు.

Last Updated : Jun 27, 2022, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details