ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిట్టి ఉపగ్రహాలకు చిన్న వాహకనౌక.. నేడే నింగిలోకి ప్రయాణం

By

Published : Aug 7, 2022, 8:31 AM IST

ISRO: అమృతోత్సవ వేళ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. తాను కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను నింగిలోకి ఎక్కుపెట్టింది. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం దీనిని ప్రయోగించేెందుకు సర్వం సిద్ధమైంది.

ISRO
ISRO

ISRO: అమృతోత్సవ వేళ ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. తాను కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను నింగిలోకి ఎక్కుపెట్టింది. తిరుపతి జిల్ల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనిద్వారా తక్కువ ఎత్తులో సమీప భూకక్ష్యలోకి ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలు ప్రవేశపెట్టనున్నారు.

ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే. దీని పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదు. ఇది అంతరిక్ష రంగం, ప్రైవేటు భారతీయ పరిశ్రమల మధ్య మరింత సహకారాన్ని సృష్టించనుంది.

ఉపగ్రహాలు ఇవీ..

నేడు నింగిలోకి పంపనున్న ఈవోఎస్‌-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఆజాదీశాట్‌ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. దీని జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను పొందుపర్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details