ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మిస్ ఇండియాగా మన తెలుగమ్మాయి.. వెయ్యి మందిని వెనక్కి నెట్టి!..

By

Published : Mar 31, 2023, 7:41 PM IST

Updated : Mar 31, 2023, 11:04 PM IST

Miss India title winner: ఐకాన్‌ మిస్‌ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్​లోని చంద్రగిరికి చెందిన యువతి భావన విజేతగా నిలిచింది. ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవేంటంటే?..

Icon Miss India title winner Bhavana press meet
మిస్ ఇండియాగా మన తెలుగమ్మాయి

Miss India title winner: గతంలో అందాల పోటీలు అంటే.. కేవలం నార్త్ ఇండియన్స్ మాత్రమే అన్నట్లుగా ఉండేవి పరిస్థితులు. అయితే ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన యువతి మిస్ ఇండియా పోటీల్లో ఎంపికవటం మాత్రమే కాక టైటిల్​ను కూడా కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ముంబయిలో ఐకాన్ మిస్ ఇండియా పోటీల్లో జరిగాయి. ఈ పోటీల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భావన అనే యువతి విజేతగా నిలిచింది. ఆమె స్వస్థలం తిరుపతి జిల్లాకు చెందిన చంద్రగిరి. మిస్ ఇండియా ఐకాన్ పోటీలో టైటిల్​ను సొంతం చేసుకున్న ఆమె.. తన జీవితంలో పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకుంది.

ఈ టైటిల్ గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని జీవితంలో మరచిపోలేని సంతోషకరమైన ఘటనగా ఆమె అభివర్ణిచింది. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 1000 మంది టైటిల్ కోసం పోటీపడినట్లుగా ఆమె తెలిపింది. వారిలో చివరి స్క్రీనింగ్​కు 300 మంది ఎంపిక అయినట్లు భావన పేర్కొంది. అందులో తాను టాప్ 20లో నిలచినట్లు ఆమె వెల్లడించింది. ముంబయిలో నాలుగు రోజులు పాటు ఉత్కంఠగా జరిగిన ఫైనల్స్​లో తాను మిస్ ఇండియా టైటిల్ విన్నర్​గా నిలవడం ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని భావన మీడియాతో పంచుకుంది.

భావన నేపథ్యం..తల్లిదండ్రులతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె.. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లుగా తెలిపింది. భవిష్యత్తులో సైంటిస్ట్ కావటమే తన లక్ష్యం అని ఆమె చెప్పింది. ప్రస్తుతం మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కిరీటాన్ని ఎంజాయ్ చేస్తున్నానని ఆమె తెలిపింది. మిసెస్ ఇండియా రైజింగ్ స్టార్ సుప్రజా చౌదరి శిక్షణతో తల్లిదండ్రుల సహాయ సహకారాలతో ఈ స్థాయికి వచ్చినట్లు వెల్లడించింది.

భావన తల్లి గృహిణి, తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమె గతంలో డైరెక్టర్ శ్రీను దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించినట్లుగా చెప్పింది. సుప్రజా చౌదరి, కవిత కిషోర్, రియాన్ శర్మలు తనకు రోల్ మోడల్స్ అని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో పాటు భవిష్యత్తులో సమాజ సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపింది.

" మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను మిస్ ఇండియా కిరీటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. భవిష్యత్తులో సైంటిస్ట్ కావటమే నా లక్ష్యం. గతంలో నేను శ్రీను దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలింలో నటించాను. సుప్రజా చౌదరి, కవిత కిషోర్, రియాన్ శర్మలు నాకు రోల్ మోడల్స్. మన దేశ వ్యాప్తంగా 1000 మంది పోటీపడగా.. 300 మంది పోటీలో నిలిచారు. వారిలో టాప్ 20లో నేను నిలిచాను. నాలుగు రోజుల పాటు ముంబయిలో జరిగిన ఫైనల్లో నేను మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నాను."
- భావన, మిస్ ఇండియా టైటిల్ విన్నర్

మిస్ ఇండియాగా మన తెలుగమ్మాయి..
Last Updated : Mar 31, 2023, 11:04 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details