ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి

By

Published : Jan 14, 2021, 4:49 PM IST

శ్రీకాకుళం జిల్లా లైదాము వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొని ఒకరు మృతి చెందారు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది.

accident
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరి మృతి

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాము జంక్షన్ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. బైక్ పై దంపతులు.. బాణం నుంచి లైదాం వెళుతుండగా మార్గమధ్యంలో ఎదురుగా ముగ్గురితో వస్తున్న ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులు వెంకటరమణ, ఆయన భార్యకు బలమైన గాయాలయ్యాయి.

వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పొందూరు సమీపంలో భర్త వెంకటరమణ మృతి చెందాడు. అతని భార్యను శ్రీకాకుళం రిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details