ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిడ్నీ రోగులకు బాసటగా నిలుస్తున్న పిరియా సాయిరాజ్

By

Published : Apr 25, 2020, 2:30 AM IST

నిరంతరం సామాజిక సేవ ఓ బాధ్యతగా స్వీకరించటం ఆయనకు అలవాటు. ఈ గుణాలే ఉద్దానం ఫౌండేషన్​ ఏర్పాటుకు అడుగులు వేశాయి. కరోనా వంటి కష్ట కాలంలో ఉద్దానం కిడ్నీ బాధితులు డయాలసిస్​కు దూరం కాకుండా సేవలు అందిస్తూ... రోగులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు పిరియా సాయిరాజ్.

helps to uddanam kidney patients
ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా పిరియా సాయిరాజ్

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు. ఉద్దానం ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న పిరియా సాయిరాజ్ దంపతులు... లాక్​డౌన్​ వలన రవాణా సౌకర్యం లేక డయాలసిస్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఆపన్నహస్తం అందించారు. ఉద్దానం ఫౌండేషన్​కి చెందిన రెండు అంబులెన్సుల ద్వారా డయాలసిస్ రోగులను ఇంటి నుంచి ఆసుపత్రులకు తరలిస్తూ... కిడ్నీ రోగులకు బాసటగా నిలుస్తున్నారు. కష్టకాలంలో సాయం చేస్తున్న పిరియా సాయిరాజ్ అన్ని వర్గాల ప్రజల మన్నలు పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details