ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Betting gang arrest in Noida : ఆన్​లైన్​ బెట్టింగ్​ల ముఠా ‘ఆట కట్టించారు’

By

Published : Jan 31, 2023, 1:09 PM IST

Betting gang arrest in Noida : సాఫ్ట్‌వేర్‌ ఆఫీసుల్ని తలపించేలా కార్యాలయం. ఒక్కొక్కరికి ఒక కంప్యూటర్‌. సమర్ధంగా పనిచేసే ఉద్యోగులు. అయితే వీరందరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఎందుకు అరెస్ట్‌ చేశారని అనుకుంటున్నారా..? ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్‌ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన గేమింగ్‌ ముఠా ఇది. తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్‌ పోలీసులు వారి ఆట కట్టించారు.

Betting gang arrest in Noida
Betting gang arrest in Noida

బెట్టింగ్​ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ ముఠా అరెస్ట్

Betting gang arrest in Noida: దిల్లీలో గేమింగ్, బెట్టింగ్‌ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ ముఠాను తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8 మంది సభ్యులున్న ముఠా బ్యాంకు ఖాతాల్లోని రూ. 41 కోట్లు జప్తు చేశారు. ఒక సైబర్‌ నేరానికి సంబంధించి, ఇంత భారీ మొత్తంలో సొమ్మును జప్తు చేయడం దేశంలోనే ఇదే ప్రథమమని పోలీసులు తెలిపారు.

Online Gaming Fraud Case: గతేడాది డిసెంబరులో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలానికి చెందిన హర్షవర్థన్‌ అనే యువకుడు గేమ్‌కింగ్‌ 567 డాట్‌ కామ్‌లో గేమ్‌ ఆడుతూ 98 లక్షలకుపైగా నగదు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందనే అంశంపై నిఘా పెట్టిన సైబర్‌ పోలీసులు ఫోన్‌ పైసా సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్‌ పోలీసులకు దిల్లీ కేంద్రంగా ఈ చీకటి దందా నడుస్తున్నట్లు తెలిసింది.

Cyber gang arrested in Noida : వెంటనే నిందితుల కదలికలపై నిఘా ఉంచి, మొదట దిల్లీలో ఒకరిని అరెస్టు చేశారు. అనంతరం ఆరా తీయగా, నోయిడాలో ఖరీదైన నివాస సముదాయంలో వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. రెక్కీ నిర్వహించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి రూ. 41 కోట్లు జప్తు చేయడంతోపాటు 193 సెల్‌ఫోన్లు, 21 ల్యాప్‌టాప్‌లు, 21 పీవోఎస్‌ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Police Have Arrested Cyber Gang: విదేశాల్లో ఉండే కొందరు సైబర్‌ నేరగాళ్ల కనుసన్నల్లో ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ దందా నడుస్తోందని పోలీసులు తెలిపారు. బెంగళూర్, ఉత్తరాఖండ్‌కు చెందిన 8 మంది వ్యక్తులు గతంలో నకిలీ కాల్‌సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేశారు. అయితే వీరి సమాచారం సేకరించిన సైబర్‌ నేరగాళ్లు వీరిని సంప్రదించారు. తమతో కలిస్తే భారీగా కమీషన్లు ఇస్తామని ఒప్పించారు. వెంటనే గేమింగ్‌ దందాను మొదలుపెట్టించారు.

బాధితుల నుంచి కొట్టేసిన డబ్బులకు సంబంధించిన లావాదేవీలను జరపడానికి నిందితుల అనుసరించిన విధానం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వివిధ రాష్ట్రాల్లోని నిరుపేదల్ని గుర్తించి వారి పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిచారు. లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనికి గాను ఖాతాదారుకు ప్రతినెలా కొంత కమీషన్‌ చెల్లిస్తున్నారు. మొత్తం 233 మంది బ్యాంకు ఖాతాలు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.

వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఈ కేసులో బ్యాంకు సిబ్బంది ప్రమేయముందని నిరూపణ ఐతే వారిపైనా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న గేమింగ్‌ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్‌ పోలీసులు సూచిస్తున్నారు.

'వాళ్లు దేనికి పర్మిషన్ అడుగుతున్నారు. ఆ ఒక్క అప్లికేషన్​లో మేము కాంటాక్ట్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా. ఇస్తే వాళ్లకి అది దేనికి ఉపయోగపడుతుంది. కొన్ని అప్లికేషన్ మీడియా ఫైల్స్​కి యాక్సిస్ అడుగుతుంది. అంటే మన ఫొటోలు, వీడియోలు, మన డాక్యుమెంట్స్​కి ఫోన్​లో ఉండటువంటి ఈ ఫైల్స్​కి అప్లికేషన్​ వాడలంటే ఈ పర్మిషన్ ఇవ్వల్సిన అవసరం ఉందా.. అనేది మేము తెలుసుకోవాలి'. -కల్మేశ్వర్ సింగ్నవార్, డీసీపీ సైబరాబాద్ క్రైం విభాగం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details