ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసులా.. పొలిటీషియన్లా..? అధికార పార్టీ కార్యకర్తల భుజాలపై మీసం మెలేసిన సీఐ

By

Published : Feb 26, 2023, 11:44 AM IST

Updated : Feb 26, 2023, 1:02 PM IST

Kadiri Urban CI : శ్రీసత్యసాయి పట్టపర్తి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు రాజకీయ నాయకుడిని తలపిస్తున్నారు. అధికారపార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి ప్రతిపక్ష టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జులూం ప్రదర్శించారు. ఆ సందర్భంగా నాయకులు భుజాల మీదకు ఎత్తుకుంటే మీసాలు మెలేస్తూ సవాల్ విసిరారు.

పట్టపర్తి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు
పట్టపర్తి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు

Kadiri Urban CI : పోలీస్.. అంటే రక్షకుడు. ఆపదలో ఉన్న వారికి, అణగారిన, బలహీన వర్గాలకు భరోసా. అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ఎంతో మంది పోలీస్ కొలువును ఎంచుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఖాకీ డ్రెస్ వేసుకోవాలని కలలుగంటారు. ఆ వృత్తికి, ధరించే యూనిఫామ్ కు ఉన్న గౌరవం అలాంటిది. కానీ, కొంతమంది పోలీస్ అధికారుల వ్యక్తిత్వం ఆశాఖకే మచ్చతెస్తోంది. అధికార పార్టీ ఆగడాలను ఎదిరించే వారినే అణచివేయడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో ఐపీసీ చట్టానికి బదులు వైసీపీ చట్టం అమలవుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి. చట్టం అధికార పార్టీ చుట్టం అన్నట్లుగా, ప్రభుత్వాన్ని, అధికార పార్టీని విమర్శించినా పౌరుషం పుట్టుకొస్తోంది. సోషల్‌ మీడియాలో చిన్న పోస్టింగ్‌ పెట్టినా... నోటీసుల పేరిట రాద్ధాంతం చేస్తున్నారు. మరోవైపు.. అధికార పార్టీ నేతలు బండబూతులు తిట్టినా, ఇళ్లపై దాడులు చేసినా, కర్రలతో చావబాదినా సరే చోద్యం చూస్తున్నారు. బాధ్యులపై కాకుండా బాధితులపైనే కేసులు మోపి శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రాజకీయ నాయకుడిని తలపించేలా... శ్రీసత్యసాయి పట్టపర్జి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు రాజకీయ నాయకుడిని తలపించేలా వ్యవహరించారు. అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైకి దూసుకుపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు సీఐ మధును భుజాల మీదకు ఎత్తుకుంటే మీసాలు మెలేస్తూ సవాల్ విసిరారు. గతంలోనూ ఆయన అధికారపార్టీ నాయకుల అండ చూసుకుని తెదేపా నాయకులపైకి తొడగొట్టారు. స్టేషన్ కు వచ్చిన మహిళా నాయకులను అవమానపరిచారు. మరోసారి మహిళా కౌన్సిలర్ ను అసభ్యంగా మాట్లాడటంతో పాటు మహిళలపై చేయిచేసున్నట్లు బాధితులు ఆరోపించారు. అంతటితో ఆగక సీఐ తీరును తప్పుపట్టిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పై సవాల్ విసురుతూ మీసాలు తిప్పి తొడగొట్టారు. బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనను వైకాపా నాయకులు భుజాలపై మోసుకుంటూ అనుకూల నినాదాలు చేయడం విస్మయానికి గురిచేసింది.

తీవ్ర ఉద్రిక్తత..శ్రీసత్యసాయి పట్టపర్జి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు వ్యవహారశైలి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవళం బజారులో ఆక్రమణల తొలగింపు సందర్భంగా టీడీపీ మహిళా కౌన్సిలర్ ను అసభ్యకర పదజాలంతో దూషించి అవమానించారు. విషయం తెలుసుకున్న మహిళా నాయకులు సీఐ నివాసం ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్లగా.. మహిళలను చూసిన సీఐ మధు ఒక్కసారిగా రెచ్చిపోయారు మహిళలని కూడా చూడకుండా లాఠీ కి పని చెప్పారు. వీధులు వెంబడి తరుముతూ దొరికిన వాళ్లను దొరికినట్లే చితకబాదారు. మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు పర్వీన్ భాను కుమారుడిని లాక్కెళ్ళి ఆయన చరవాణిని పగులగొట్టారు. మా ఇంటికే వచ్చే అంత దమ్ముందా అంటూ వాహనం పైకెక్కి హెచ్చరించారు ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ బెదిరించారు. ఈ విషయన్ని మహిళలు నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీ శ్రేణులతో పాటు జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టి సీఐపై చర్యలకు డిమాండ్ చేశారు.

విచక్షణారహితంగా దాడి...ఆందోళనను జీర్ణించుకోలేని సీఐ మధు.. అధికార పార్టీ నాయకులకు సమాచారం చేరవేశారు. వైఎస్సార్సీపీ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపైకి రాళ్లు, బాటిళ్లు విసిరారు. కర్రలతో దాడిచేయడంతో పదిహేనుమంది కార్యకర్తలు గాయపడ్డారు. రాత్రి సమయంలో రాళ్లతో దాడిచేయడంతో ఏమి జరుగుతోందో అర్థంగాక గందరగోళ పరిస్థితి నెలకొంది. కదిరి అప్ గ్రేడ్, గ్రామీణ, నల్లమాడ సీఐలు సిబ్బందిపాటు అక్కడికి చేరుకుని రెండు పార్టీల శ్రేణులను చెదరగొట్టారు. రాస్తారోకో చేస్తున్న వారిని స్టేషన్ కు తరలించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను టీడీపీ నాయకులు బీకే పార్థసారథి, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు.

పట్టపర్తి జిల్లా కదిరి అర్బన్ సీఐ మధు

ఇవీ చదవండి :

Last Updated : Feb 26, 2023, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details