Kadiri YSRCP Leaders against MP and MLA: సత్యసాయి జిల్లా కదిరి వైకాపాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డిపై కదిరి పట్టణ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కదిరిలోని కూటగుళ్లలో వైకాపా అసమ్మతి నాయకులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి.. పట్టణ వైకాపా అధ్యక్షుడు బాహావుద్దీన్ హాజరయ్యారు.
కదిరిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి.. ఎందుకంటే..!
Kadiri YSRCP leaders: కదిరిలో వైకాపా నాయకుల్లో వర్గపోరు ముదురుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు ఎవ్వరో తెలియని ఎంపీ.. పార్టీ కార్యకర్తను దగ్గరకు తీసుకోని ఎమ్మెల్యే ఉండటం దురదృష్టకరమని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్యకర్తలను పట్టించుకోకపోతే తమ శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
ysrcp leaders
పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడ్డ వారిని.. మూడున్నరేళ్లలో ఒక్కసారైనా పలకరించారా అంటూ ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్యకర్తలను పట్టించుకోకపోతే తమ శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడెవరో కూడా తెలియని వ్యక్తి ఎంపీగా ఉంటే సామాన్య కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని బాహావుద్దీన్ విమర్శించారు.
ఇవీ చదవండి: