ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two Groups Clash: సప్పలమ్మ జాతరలో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ... మహిళలపై కర్రలతో దాడి

By

Published : Apr 13, 2022, 11:23 AM IST

Two groups fighting: నల్లమాడ మండలం సీకివారి పల్లిలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాతకక్షలను దృష్టిలో ఉంచుకుని ఇరువర్గాలు కర్రలు, రాళ్లలతో దాడు చేసుకున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలను తీవ్రంగా కొట్టారు. ఈ దాడుల్లో 10 మంది గాయపడ్డారు.

Two groups fighting
సీకివారి పల్లిలో ఇరువర్గాల ఘర్షణ

సీకివారి పల్లిలో ఇరువర్గాల ఘర్షణ

Two groups fighting: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం సికివారిపల్లి గ్రామం సప్పలమ్మ జాతరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పది మందికి గాయాలయ్యాయి. ఎడ్లబండి విషయమై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని విచక్షణారహితంగా మహిళలపై దాడి చేశారు.

Two groups fighting: ఓ సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్లలోకి ప్రవేశించి మరీ.. మహిళలని కూడా చూడకుండా కర్రలతో చితకబాదారు. మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత కక్షలే గొడవకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Ex-Minister Dance: యువకులతో కలిసి.. మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్టెప్పులు

ABOUT THE AUTHOR

...view details