ఆంధ్రప్రదేశ్

andhra pradesh

villagers fire on YSRCP MLA: 'గడప గడప'లో అపశృతి.. డీజే వాహనం దూసుకెళ్లి బాలుడికి తీవ్ర గాయాలు

By

Published : Jun 28, 2023, 1:20 PM IST

Updated : Jun 28, 2023, 3:57 PM IST

Darimadugu Villagers fire on YSRCP MLA Nagarjuna Reddy: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి పథకాల గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రజల నుంచి ప్రశ్నలు, సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా గడప గడపకు కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.

GADAPA
GADAPA

Darimadugu Villagers fire on YSRCP MLA Nagarjuna Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గతకొన్ని నెలలుగా 'గడప గడపకు మన ప్రభుత్వం' అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి విమర్శలు, ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ కార్యక్రమంలో ఓ అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన డీజే వాహనం కారణంగా.. తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గడప గడప కార్యక్రమంలో అపశృతి.. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో మంగళవారం రోజున'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఓ డీజే వాహనం ఢీకొని ఖాదర్ భాషా అనే తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి కుడి కాలు పై నుంచి వాహనం వెళ్లడంతో బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.

Whip Kapu Ramachandra reddy ప్రజలు లేరు.. గడపగడపకు ఎలా నిర్వహించేది ? కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఎమ్మెల్యే!

బాలుడిని పరామర్శించిన టీడీపీ అధ్యక్షుడు.. అయితేగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలుడు తీవ్రంగా గాయపడ్డా.. ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి అతన్ని పరామర్శించకుండా కార్యక్రమాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు, బాలుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించినందుకు కళ్లముందు ఇంత ప్రమాదం జరిగిన.. ఎమ్మెల్యే పట్టించుకోలేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. తమ బిడ్డకు సరైన చికిత్స, న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జవ్వాజి రామాంజులు రెడ్డి వైద్యశాలకు చేరుకుని.. బాలుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో బాలుడి కాలు విరిగినట్లు తండ్రి ఖాసిం వలీ వాపోవడంతో.. అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు.

Protest to YSRCP MLA: జాబ్ క్యాలెండర్ ఏమైంది? జగన్ హామీలు ఏమయ్యాయి ? వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

జగన్ ఇచ్చిన హామీలు ఏమయాయ్యి..?..మరోపక్క గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు చేదు అనుభవాలు, పరాభవాలు ఎదురవుతున్నాయి. ఓట్లేసి గెలిపించినందుకు నాలుగేళ్లలో గ్రామ అభివృద్ధికి, యువతకు, ప్రజలకు ఏం చేశారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు ఏమయాయ్యి అని ప్రశ్నిస్తున్నారు. దీంతో స్థానికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వైఎస్సార్సీపీ నాయకులు వెనుదిరుగుతున్నారు.

Last Updated : Jun 28, 2023, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details