ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పురపాలిక బరిలో.. అక్కాచెల్లెళ్లు!

By

Published : Mar 6, 2021, 2:06 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలిక ఎన్నికల్లో అక్కా చెల్లెళ్లు సై అంటున్నారు. 13వ వార్డులో అభ్యర్థులుగా సొంత అక్కాచెల్లెళ్లు బరిలో నిలిచారు. వీరిద్దరూ ఒకే వార్డు నుంచి పోటీ చేస్తుండటంతో ఎవరు గెలుస్తారో అని స్థానికులు ఆసక్తిగా ఉన్నారు.

sisters fighting Nellore district athmakuru municipality
పురపాలిక బరిలో అక్కాచెల్లెళ్లు

పురపాలిక బరిలో అక్కాచెల్లెళ్లు

వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరికొకరు ఆప్యాయంగా ఉండే వారిద్దరూ.. పుర సమరంలో ప్రత్యర్థులుగా నిలిచారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 13వ వార్డులో అక్కాచెల్లెళ్ల పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది. ఆత్మకూరులోని 13వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు.

తెలుగుదేశం తరఫున మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ తన తల్లి లక్ష్మిని బరిలో నిలిపారు. ఇదే వార్డులో అధికార వైకాపా తరఫున లక్ష్మీ చెల్లెలు తిరుపతమ్మ పోటీకి దిగారు. అక్క గృహిణి కాగా.. చెల్లెలు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సోదరీమణుల సమరంలో.. విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details