ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Theft: ఆగిఉన్న కంటైనర్​లో చోరీ.. రూ.3 లక్షల విలువైన కూలర్లు అపహరణ

By

Published : Jun 16, 2021, 4:21 PM IST

రోజు రోజుకు దొంగలు పేట్రేగిపోతున్నారు. ఏకంగా జాతీయ రహదారిపై చోరీకి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ నుంచి రూ.3 లక్షల విలువైన కూలర్లు దోచుకెళ్లారు.

coolers stolen from container at Ramannapalem
కంటైనర్​లోంచి రూ.3 లక్షల విలువైన కూలర్లు చోరీ

ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగలు.. ఇప్పడు ఏకంగా జాతీయ రహదారులపైనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనే నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఆగి ఉన్న కంటైనర్‌ నుంచి కూలర్లును దోచుకెళ్లారు. వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details