ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఏళ్ల తరబడి నివసిస్తున్నాం.. వరద వస్తే సర్వం కోల్పోతున్నాం'

By

Published : Nov 28, 2020, 9:05 PM IST

Updated : Nov 28, 2020, 9:35 PM IST

పెన్నానది పొర్లుకట్ట వరద పోటెత్తింది. సమీపంలో నివసించే ప్రజలు నీట మునిగారు. ఇళ్లలో బియ్యం, పప్పు దినుసులతోపాటు బట్టలు, ఇతర సామగ్రి పనికి రాకుండాపోయాయి. ఏళ్లతరబడి నివసిస్తున్నా వరద వచ్చినప్పుడల్లా సర్వం కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తమ కష్టాలు మాత్రం మారటం లేదనే వాళ్ల అసంతృప్తిని ఏ నాయకుడు తీరుస్తాడో మరి!

People are suffering
వరద వస్తే సర్వం కోల్పోతున్నాం

వరద వస్తే సర్వం కోల్పోతున్నాం

నెల్లూరు జిల్లాలో పెన్నా నది నుంచి నీరు నివాసల్లోకి రాకుండా రక్షణ కోసం నిర్మించిన పొర్లుకట్ట వరదతో పొటెత్తుతోంది. నివర్ తుపాను ప్రభావం వల్ల పొర్లుకట్ట సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఏళ్ల తరబడి నివసిస్తున్నా.. వరద వచ్చినప్పుడల్లా సర్వం కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ తమ కుటుంబాలు నీళ్లల్లో చిక్కుకుపోతున్నాయని వాపోతున్నారు. ఇళ్లలోని బియ్యం, పప్పు దినుసులతోపాటు బట్టలు, ఇతర సామగ్రి తడిచిపోయి పనికి రాకుండా పోయాయని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

భయంగా ఉంది..

విద్యుత్తును నిలిపివేయడం వల్ల విష పురుగులు, పాములు వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. వరద తగ్గిన ప్రాంతాలు బురదతో దర్శనమిస్తున్నాయి. ఏన్ని ప్రభుత్వాలు మారినా తమను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని పొర్లుకట్ట ముంపు బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నివర్ తుపాను ఎఫెక్ట్: ముంపులోనే కాలనీలు

Last Updated : Nov 28, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details