ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయ మహిళా సిబ్బందిపై వైకాపా నేత వేధింపులు..

By

Published : Aug 17, 2021, 4:40 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సచివాలయ మహిళా సిబ్బందిని వేధిస్తున్న వైకాపా నేత సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మర్రిపాడు పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

Secretariat staff protest at Marripada mpdo office
మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ సిబ్బంది ఆందోళన

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం గ్రామంలోని సచివాలయ మహిళా సిబ్బందిని వైకాపా నేత ఎర్రమల సుబ్బారెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు నందవరం సచివాలయ సిబ్బంది.. విధులు బహిష్కరించి మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైకాపా నేత వేధింపులు భరించలేక ఆందోళనకు దిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్ల బాధను ఎంపీడీవోకు విన్నవించుకున్నారు.

సచివాలయ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన‌ంతరం సుబ్బారెడ్డిపై మర్రిపాడు పోలీస్​ స్టేషన్​లో పిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details