ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MPDO on OTS : జనాలు బుద్ధి వాడట్లేదు.. ఓటీఎస్​పై ఎంపీడీవో వివాదాస్పద వ్యాఖ్యలు!

By

Published : Dec 9, 2021, 3:36 PM IST

Updated : Dec 9, 2021, 4:30 PM IST

MPDO Controversial Comments: నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్​పై పొదుపు మహిళలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆమె.. గత ప్రభుత్వాలకు ప్రజలపై ప్రేమ ఉంటే ఉచితంగా పట్టాలు, రుణమాఫీలు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు.

ఎంపీడీవో వివాదాస్పద వ్యాఖ్యలు
ఎంపీడీవో వివాదాస్పద వ్యాఖ్యలు

MPDO Controversial Comments: నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్​డీవో అధ్యక్షతన మర్రిపాడు సచివాలయంలో ఓటీఎస్​పై.. పొదుపు మహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలకు ప్రజలపై ప్రేమ ఉంటే ఉచితంగా పట్టాలు, రుణమాఫీలు ఎందుకు చేయలేదంటూ వ్యాఖ్యనించారు.

"గత ప్రభుత్వాలకు అప్పుడు మీ మీద ప్రేమ ఎందుకు లేదు? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు మీకు ఎందుకు రుణమాఫీ, పట్టాలు ఇవ్వలేదు? చెప్పుడు మాటలు నమ్ముతున్నారా? మీరు బుద్ధిని ఉపయోగించండి. మీ బుద్ధి పనిచేయట్లేదు. ఎక్కడో దాచిపెట్టి వచ్చారు. అందుకే చెప్పుడు మాటలు వింటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చిందో తెలుసా? ఓటీఎస్ మీకోసం తీసుకొచ్చింది. 10 వేలు మిమ్మల్ని రుణ విముక్తులను చేయటం కోసమే. ఇది అర్థం చేసుకోకుండా వేరే వాళ్లు చెప్పే అబద్ధపు మాటలు నమ్ముతున్నారు." అని ఎంపీడీవో సుస్మిత రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎంపీడీవో తీరు గతంలోనూ వివాదస్పదం..
మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ టార్గెట్లను నిర్దేశిస్తూ.. గ్రామ కార్యదర్శుల, వీర్వోలకు, డిజిటల్ అసిస్టెంట్లకు మూడ్రోజుల క్రితం హుకుం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో రోజుకు కనీసం పది చొప్పున ఓటీఎస్​లు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఓటీఎస్ కట్టని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలపై సంతకాలు పెట్టొద్దని అధికారులను ఆదేశించారంటూ..ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఆడియో లీక్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్.. వివరణ కోరుతూ మర్రిపాడు ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఎంపీడీవో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ప్రస్తుత ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శించటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విధంగా వ్యవహరించటం సరికాదని అంటున్నారు.

ఇదీ చదవండి :

'ఓటీఎస్' డబ్బు చెల్లించకుంటే పథకాలు కట్.. ఎంపీడీవో ఆడియో వైరల్!

Last Updated : Dec 9, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details