ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్యను చంపిన భర్త.. అనుమానమే కారణమా!

By

Published : Jan 31, 2021, 12:40 PM IST

Updated : Jan 31, 2021, 4:09 PM IST

భర్తే కిరాతకంగా భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అనుమానమే హత్యకు కారణమని స్థానికులంటున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరులో జరిగింది.

Husband who killed wife on suspicion
అనుమానంతో భార్యను చంపిన భర్త

నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామంలో ఓ వ్యక్తి కిరాతకంగా భార్యను హత్య చేశాడు. భార్యపై అనుమానంతోనే దారుణంగా గొంతుకోసి హత్య చేసి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న హరికృష్ణ, స్రవంతిలు గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం కలతలు రేపింది. ఈ నేపథ్యంలో భార్య గొంతు కోసి భర్తే హత్య చేసి.. అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విషం తాగి హోంగార్డు ఆత్మహత్య

Last Updated : Jan 31, 2021, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details