ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జోరు వానలు.. జనజీవనం అతలాకుతలం

By

Published : Dec 7, 2020, 4:09 PM IST

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే రోడ్లు, వీధులు జలమయం కావటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పనులన్నీ స్తంభించాయి.

heavy rains nellore district
జోరు వానలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో భారీ వర్షం కురిసింది. దాంతో రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చెరువులు తెగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details