ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు జిల్లాలో జోరుగా వర్షాలు

By

Published : Dec 5, 2020, 1:13 AM IST

జోరుగా కురుస్తున్న వర్షాలకు.. నెల్లూరు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కావలి, కోవూరు, గూడూరు, నెల్లూరు నగరంలో పడుతున్న జోరు వానలకు.. పలు కాలనీలు బురదమయమయ్యాయి.

heavy roads in nellore
నెల్లూరులో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలోని కావలి, కోవూరు, గూడూరు, నెల్లూరు నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శివారు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావలిలోని వెంగళ్రావునగర్​ కొత్త శివాలయం వద్ద కాలనీ అంతా బురదగా మారింది. పక్కనే ఉన్న బుడంగుంట చెరువులోని నీరు కాలనీవైపుకు రాగా.. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. తూములు మూసివేతతో నీరు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది.

నెల్లూరులో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details