ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెన్నా నది ఒడ్డున ఘనంగా గొబ్బెమ్మల పండుగ

By

Published : Jan 17, 2021, 8:53 AM IST

Updated : Jan 17, 2021, 10:05 AM IST

గొబ్బెమ్మను గౌరి దేవిగా భావిస్తూ.. నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ వైభవంగా జరిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పెన్నానదిలో భక్తులు నిమజ్జనం చేశారు. అనంతరం అక్కడే ఆటపాటలతో సందడి చేశారు.

gobbemmala festival at penna river coast
పెన్నానది తీరంలో ఘనంగా గొబ్బెమ్మల పండుగ

పెన్నానది తీరంలో ఘనంగా గొబ్బెమ్మల పండుగ

నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ ఘనంగా నిర్వహించారు. గౌరి దేవిగా భావించి గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, పెన్నానదిలో వాటిని నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఆటపాటలతో సందడి చేశారు.

జిల్లాలో ప్రసిద్ధ చెందిన ఆలయాల ఉత్సవ మూర్తులు అక్కడ కొలువుదీరి ఉండగా.. దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేశారు. యువతీ యువకులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

Last Updated : Jan 17, 2021, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details