ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పోలీసు సారూ... న్యాయం చేయకపోతే ఇక్కడే చనిపోతా'

By

Published : Dec 11, 2019, 3:16 PM IST

పొలం సమస్యపై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని... స్టేషన్ వద్దే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ వృద్ధురాలు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం పోలీస్​స్టేషన్ వద్ద జరిగింది.

a old women try to attempt sucide for her land in front of sangam police station at nellore district
తనకు న్యానం చేయకపోకే పురుగులు మందు తాగి చనిపోతానంటున్న వృద్ధురాలు సుబ్బమ్మ

'పోలీసు సారూ... న్యాయం చేయకపోతే ఇక్కడే చనిపోతా'

నెల్లూరు జిల్లాలోని పెరమన గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ... సంగం ఠాణా ఎదుట పురుగులు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు స్పందించి ఆమె నుంచి పురుగులు మందుసీసాను తీసుకున్నారు. తనకున్న ఐదెకరాల పొలం పక్కనే ఉన్న 75 సెంట్ల భూమిని... 20 ఏళ్లుగా సాగు చేసుకుంటుంది వెంకటసుబ్బమ్మ. అయింతే రెండేళ్లుగా ఆత్మకూరులోని తన కొడుకు వద్దకు వచ్చి నివాసం ఉంది.

ఇదే అదునుగా భావించి... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుబ్బమ్మ ఆధీనంలో ఉన్న 75 సెంట్లను ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని నెలలుగా ఇరువురి మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించి తనకు న్యాయం చేయాలని సుబ్బమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పొలం వద్దకు చేరుకొని విచారించి... సరైన ఆధారాలు చూపించాలని చెప్పారు. అప్పటివరకూ పొలం వద్దకు వెళ్లవద్దని ఆదేశించారు.

పోలీసుల ఆదేశాలను పట్టించుకోని అక్రమదారుడు పొలంలో వరి నాట్ల పనులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న వెంకటసుబ్బమ్మ పురుగుల మందు డబ్బాతో సంగం పోలీస్ స్టేషన్​కు వచ్చింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ... ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆమె చేతిలోని పురుగులమందు లాక్కున్నారు. తనకు న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇవ్వడంతో సుబ్బమ్మ ఆందోళన విరమించింది.

ఇదీ చదవండీ:

మనుమడికి భూమి రాయించాడని తండ్రిని చంపేశాడు...

ABOUT THE AUTHOR

...view details