ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crop loss: ఎడతెరిపి లేకుండా వర్షాలు... వందల ఎకరాల్లో పంట నష్టం

By

Published : Oct 7, 2022, 12:12 PM IST

Crop loss: పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు నష్టపోయారు. వందల ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి దెబ్బతిన్నాయి. చేతికందిన మొక్కజొన్న మొలకెత్తింది. అధిక వర్షాలకు చేలల్లో నీరు చేరి పత్తి కాయలు నల్లగా మారి కుళ్లిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Rains
భారీ వర్షంతో పంటనష్టం

Crop loss: పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు ఎడితెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పాచిపెంట, సాలూరు మండలాల్లోని ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందల ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంట, వరి పంటికు నష్టం వాటిల్లింది. రైతులు మొక్కజొన్న పంట కోసి గత నాలుగు రోజులుగా రోడ్డుపై టార్పాన్ కప్పిసి ఉంచారు. అయినా విత్తనాలు మొలకెత్తాయని వాపోయారు. అధిక వర్షాల కారణంగా పత్తిలో నీరు చేరి పత్తి కాయలు నల్లగా కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టమని, ఇప్పుడు పైసా కూడా చేతికందే పరిస్థితి లేదంటున్నారు. నాయుడు చెరువు చెరుకుపల్లి గడ్డ పొంగి సాలూరు లోతట్టు ప్రాంతాలైన రామా కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. లెప్రసీ మిషన్ హాస్పిటల్ దగ్గర హైవేపై నీరు పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details