ఆంధ్రప్రదేశ్

andhra pradesh

టీడీపీ నేత బచ్చుల అర్జునుడికి గుండెనొప్పి.. పరిస్థితి విషమం

By

Published : Jan 29, 2023, 5:51 PM IST

Bachula Arjuna cardiac arrest updates: టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగానే ఉందని, 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు.

Bachula Arjunudu
బచ్చుల అర్జునుడు

Bachula Arjunudu Cardiac Arrest updates: టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 4 గంటల సమయంలో ఆయనకు గుండెనొప్పి రావటంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అర్జునుడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. వెంటనే అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో ఆయనకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారు.

బీపీ ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్లర్టు తెలిపారు. ఆసుపత్రికి వచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్‌‌కు గురయ్యారని.. వెంటనే సీపీఆర్ చేసి ఐసీయూకి తరలించామన్నారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి గురించి 48 గంటలు గడిచిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని రమేష్ ఆసుపత్రి ఎండీ డా. రమేష్ తెలిపారు.

మరోవైపు బచ్చుల అర్జునుడు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని.. కుటుంబ సభ్యులు గానీ, కార్యకర్తలు గానీ ఆందోళన చెందొద్దని వారు తెలిపారు.

టీడీపీ నేత బచ్చుల అర్జునుడికి కార్డియాక్ అరెస్ట్.. పరిస్థితి విషమం

బచ్చుల అర్జునుడు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి హార్ట్‌ఎటాక్‌కు గురయ్యారు. ఆయన కుమారులు వెంటనే ఆస్పత్రికి తీసుకురావటం వల్ల డాక్టర్ రమేష్, ఆయన వైద్య బృందమంతా అందుబాటులో ఉండి సకాలంలో చికిత్స అందించారు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆయనకు గుండెశ్వాస ఆగిపోయింది. సీపీఆర్ ద్వారా డాక్టర్లు మళ్లీ ఆయనకు శ్వాసను అందించి, చికిత్సను అందించారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తారని మేమంతా ఆశాభావంతో ఉన్నాం.-కొనకళ్ల నారాయణ, మాజీ ఎంపీ

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details